Amaravati: రైతులకు శుభవార్త.. ఏపీలో ప్రాజెక్టుల వారీగా ఇరిగేషన్ క్యాలెండర్ ఇదే!
Amaravati: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా ఇరిగేషన్ క్యాలెండర్!
Amaravati: రైతులకు శుభవార్త.. ఏపీలో ప్రాజెక్టుల వారీగా ఇరిగేషన్ క్యాలెండర్ ఇదే!
అమరావతి: ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువును కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి. 25 ప్రాజెక్టుల పూర్తి, పనులు ప్రారంభించే గడువును ప్రకటించిన సీఎం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ప్రకటించని విధంగా ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించిన సీఎం. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటేలా సీఎం చంద్రబాబు ప్రకటన.
ముఖ్యమంత్రి ప్రకటించిన సాగు నీటి ప్రాజెక్టుల వివరాలివే..:
1. కాటన్ బ్యారేజ్ గేట్స్ (ఫౌండేషన్) - జూన్ 2026
2. పోలవరం ఎడమ ప్రధాన కాలువ - జూలై 2026
3. గుంటూరు ఛానల్ ఆధునీకరణ (ఫౌండేషన్) - జూలై 2026
4. వెలిగొండ ఫేజ్ - 1 - ఆగస్టు 2026
5. తుంగభద్ర కొత్త గేట్లు - జూన్ / జూలై 2026
6. హంద్రీ నీవా బ్రాంచ్ (ఫౌండేషన్) - ఆగస్టు 2026
7. గాలేరు నగారి (ఫౌండేషన్) - ఆగస్టు 2026
8. నేరడి బ్యారేజ్ (ఫౌండేషన్) - నవంబర్ 2026
9. మద్దువలస ఫేజ్-2 - జనవరి 2027
10. హిర మండంల ఎత్తిపోతల పథకం - ఏప్రిల్ 2027
11. నాగావళి - చంపావతి నదుల లింక్- జూన్ 2027
12. పోలవరం ప్రాజెక్ట్ - జూన్ 2027
13. బుడమేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ (అండర్ టన్నెల్, డ్రైనేజ్ ఛానల్, కొల్లేరు వరకు) - జూన్ 2027
14. ముక్త్యాల ఎత్తిపోతల పథకం - జూన్ 2027
15. వంశధార ఫేజ్-2 స్టేజ్-2 (హిర మండలం బ్యారేజ్) - జూలై 2027
16. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 - జూన్ / జూలై 2027
17. హంద్రీ-నీవా ఫేజ్-2 - జూలై 2027
18. తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ - జూలై 2027
19. నీవా బ్రాంచ్ కెనాల్ (మూలపల్లి వరకు) - డిసెంబర్ 2027
20. మూలపల్లి లిఫ్ట్ - డిసెంబర్ 2027
21. మడకశిర బ్రాంచ్ కెనాల్ వైడెనింగ్ - డిసెంబర్ 2027
22. ఝంఝావతి రిజర్వాయర్ - డిసెంబర్ 2027
23. వేదవతి ఎత్తిపోతల పథకం - జూన్ 2028
24. భైరవాని తిప్ప - జూన్ 2028
25. అపర్ పెన్నార్ ప్రాజెక్ట్ - జూన్ 2028




