Amaravati: ఫైళ్ల క్లియరెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష..!
Amaravati: పాలనలో ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అన్ని శాఖల్లో నెల రోజుల్లోగా ఆన్‌లైన్ నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.
Amaravati: ఫైళ్ల క్లియరెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష..!
Amaravati: పాలనలో వేగం పెంచేందుకు ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఫైళ్లను సకాలంలో పరిష్కరించకుండా జాప్యం చేస్తున్న అధికారుల తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించిన పనులు వేగంగా జరగాలంటే నిర్ణయాలు కూడా అదే స్థాయిలో వేగంగా ఉండాలని స్పష్టం చేశారు.
పాలన వేగంగా సాగాలంటే ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని పదేపదే చెబుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రోజుల్లోపు, అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లను క్లియర్ చేస్తున్న అధికారులను ఆయన అభినందించారు. ముఖ్యంగా జీరో డేలోనే ఫైళ్లను పరిష్కరిస్తున్న అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదే సమయంలో నాలుగు రోజుల వరకు ఫైళ్లను పెండింగ్‌లో ఉంచుతున్న మంత్రులు తమ పనితీరులో వేగం పెంచుకోవాలని సూచించారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగితే దాని ప్రభావం నేరుగా పాలనపై, ప్రజలకు అందాల్సిన సేవలపై పడుతుందని సీఎం స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కలెక్టర్ల సదస్సుకు కొందరు అధికారులు హాజరు కాకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన కలెక్టర్ల సదస్సుకు అధికారులు గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. అసలు అధికారులు సదస్సుకు హాజరుకాకుండా ఉండే ధైర్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. గైర్హాజరైన అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఆదేశించారు.
అధికారుల పనితీరును అంచనా వేసే విషయంలో ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల నుంచి సరైన ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడే అధికారుల పనితీరులో అవసరమైన మార్పులు, సవరణలు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఐఏఎస్ అధికారుల 360 డిగ్రీల పనితీరు నివేదికను కూడా అందరి అభిప్రాయాలను తీసుకుని రూపొందిస్తామని సీఎం తెలిపారు. అధికారుల పనితీరులో పారదర్శకత, బాధ్యత పెంచడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించడం తప్పనిసరి అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాల్లో కూర్చొని పాలన చేయకుండా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, అధికారుల పనితీరు వంటి అంశాలపై క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా స్పష్టమైన అవగాహన వస్తుందని పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఫైళ్ల నిర్వహణను ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకు నెలరోజుల గడువు విధించారు. ఇకపై మాన్యువల్‌గా ఫైళ్ల నిర్వహణ కొనసాగిస్తే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని అధికారులను హెచ్చరించారు. ప్రస్తుతం మాన్యువల్‌గా నిర్వహిస్తున్న ఫైళ్ల వివరాలను సేకరించి, వాటిపై నెలరోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియపై మంత్రులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
పాలనలో జాప్యానికి తావులేకుండా నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, ఫైళ్లను సకాలంలో పరిష్కరించడం, క్షేత్రస్థాయిలో పర్యటించడం, ఆన్‌లైన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు....




