AP: మొబైల్ ఫోన్‌తోనే కుల ధృవీకరణ పత్రం.. మనమిత్ర ద్వారా సులభంగా జారీ!
AP: ఆంధ్రప్రదేశ్‌లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధృవీకరణ పత్రాన్ని మొబైల్ నుంచే సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీజీఎస్ అందుబాటులోకి తెచ్చింది.
AP: మొబైల్ ఫోన్‌తోనే కుల ధృవీకరణ పత్రం.. మనమిత్ర ద్వారా సులభంగా జారీ!
AP: పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధృవీకరణ పత్రాన్ని పౌరులు తమ మొబైల్ ఫోన్ నుంచే పొందే అవకాశం కల్పించింది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తాము ఉన్నచోటు నుంచే ఈ సేవను వినియోగించుకోవచ్చు.
కుల ధృవీకరణ పత్రం అవసరమైన వారు ముందుగా 9552300009 మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్‌కు ‘Hi’ అని సందేశం పంపాలి. అనంతరం అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల జాబితా నుంచి సంబంధిత సేవను ఎంపిక చేసుకోవాలి. అందులో రెవెన్యూ సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత Re-Issuance of Integrated Certificate అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
తదుపరి దశలో పౌరులు తమ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ నమోదు చేసిన అనంతరం సంబంధిత మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసి, కోరిన వివరాలను పొందుపరిచిన తర్వాత కుల ధృవీకరణ పత్రం కోసం నిర్ణయించిన రూ.40 రుసుమును చెల్లించాలి.
రుసుము చెల్లింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కుల ధృవీకరణ పత్రం పౌరుల మొబైల్ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ధృవీకరణ పత్రం కోసం సంబంధిత కార్యాలయానికి నేరుగా వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.
డిజిటల్ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర అవసరాల కోసం కుల ధృవీకరణ పత్రం అవసరమయ్యే పౌరులకు ఈ సేవ మరింత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారానే సులభంగా కుల ధృవీకరణ పత్రాన్ని పొందే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీజీఎస్ అధికారులు కోరారు.




