Amaravati: 31వ రోజూ విజయవంతంగా 'ఇంటింటికీ తెలుగుదేశం'!
Amaravati: రాష్ట్రవ్యాప్తంగా 86.24 లక్షల ఇళ్లకు చేరుకున్న 'ఇంటింటికీ తెలుగుదేశం'. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్న టీడీపీ శ్రేణులు.
Amaravati: 31వ రోజూ విజయవంతంగా 'ఇంటింటికీ తెలుగుదేశం'!
Amaravati: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు… ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం 31వ రోజూ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది.
నేడు రాష్ట్రవ్యాప్తంగా 2,31,918 ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 86.24 లక్షల ఇళ్లను పార్టీ శ్రేణులు సందర్శించాయి. ప్రతి గడపకు వెళ్లి ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలిసి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరిస్తూ రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయా కుటుంబాలకు తెలియజేస్తున్నారు.
అదే సమయంలో ప్రజల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యమవుతున్నారు.




