కూటమి బలోపేతానికి కృషి చేస్తా: లింగమనేని రమేష్.. సీఎం చంద్రబాబును కలిసిన జనసేన రాజ్యసభ అభ్యర్థి

Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్‌తో సీఎం చంద్రబాబు భేటీ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 7 Jun 2026 2:22 PM IST
Lingamaneni Ramesh
X

కూటమి బలోపేతానికి కృషి చేస్తా: లింగమనేని రమేష్.. సీఎం చంద్రబాబును కలిసిన జనసేన రాజ్యసభ అభ్యర్థి

Lingamaneni Ramesh: జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన లింగమనేని రమేష్ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, కూటమి ఆశయాల సాధన కోసం తనవంతు బాధ్యతతో పనిచేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నట్లు సమాచారం.

ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కూటమి తరఫున రాజ్యసభకు తన పేరును ఖరారు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన లింగమనేని రమేష్, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను పార్లమెంట్ వేదికగా బలంగా వినిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్, ఎమ్మెల్సీ హరి ప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతోందనే సంకేతాలను ఈ భేటీ ఇచ్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా లింగమనేని రమేష్ విజయం లాంఛనమేనని నేతలు అభిప్రాయపడుతున్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story