కంభం రోడ్డు ప్రమాదం విషాదం... బాధితులకు ప్రభుత్వం అండ

Amaravati: కంభంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 3 July 2026 11:58 AM IST
Amaravati
X

కంభం రోడ్డు ప్రమాదం విషాదం... బాధితులకు ప్రభుత్వం అండ

అమరావతి: మార్కాపురం జిల్లా కంభంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి వేడుకల ఆనందం ఒక్కసారిగా శోకసంద్రంగా మారడంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత బాధాకరమని, అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో కలచివేసిందని అన్నారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్యాధికారులను వెంటనే ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చికిత్స అందించాలని స్పష్టం చేశారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కూడా అధికారులను సూచించారు.

గాయపడిన వారంతా త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని మంత్రి ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారని, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి కారణాల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి రాకూడదని అన్నారు. ప్రయాణ సమయంలో అప్రమత్తత, బాధ్యతతో వ్యవహరిస్తే ఇలాంటి విషాద ఘటనలను చాలా వరకు నివారించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, రహదారి భద్రతపై మరింత అవగాహన పెంచేందుకు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story