Amaravati: ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ

Amaravati: ఆంధ్రప్రదేశ్ APOSS ద్వారా 2026-27 విద్యాసంవత్సరానికి ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల కరపత్రాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 July 2026 11:18 AM IST
Amaravati
X

Amaravati: ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ

Amaravati: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు సువర్ణావకాశం కల్పించబడిందని, పాఠశాల విద్యను మధ్యలో నిలిపివేసిన వారు, పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయినవారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

శనివారం ఉదయం మంత్రి తన నివాసంలో ఓపెన్ స్కూల్ 2026–2027 విద్యాసంవత్సర ప్రవేశాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు పూర్తై చదవడం, రాయడం తెలిసిన వారు పదో తరగతిలో ప్రవేశం పొందవచ్చని,పదో తరగతి ఉత్తీర్ణులై 15 సంవత్సరాలు నిండిన వారు ఇంటర్మీడియట్‌లో చేరేందుకు ప్రభుత్వం చక్కని అవకాశం కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాస్ రాజు, డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story