Nara Lokesh: కోట్లాదిమంది సోదరీమణులు నాకు దేవుడిచ్చిన బహుమతి: నారా లోకేష్!
Nara Lokesh: రక్షాబంధన్ సందర్భంగా తెలుగు ఆడపడుచులందరికీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భద్రత, సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Nara Lokesh: కోట్లాదిమంది సోదరీమణులు నాకు దేవుడిచ్చిన బహుమతి: నారా లోకేష్!
Nara Lokesh: తోడబుట్టిన సోదరీమణులు లేకపోయినా.. దేవుడే కోట్లాదిమంది సోదరీమణులను తనకు తోడుగా ఇచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కాచెల్లెళ్లు చూపించే ప్రేమాభిమానాలు తనకు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. మహిళాలోకం చూపించే ఆత్మీయత తనలో మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు.
విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించే విధంగా పిల్లల్లో నైతిక విలువలను పెంపొందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవం, బాధ్యత, సమానత్వ భావన చిన్నతనం నుంచే అలవడేలా విద్యా వ్యవస్థలో విలువల ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళల భద్రత, సాధికారత ప్రజా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
మహిళలు అన్ని రంగాల్లో స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అక్కాచెల్లెళ్ల రక్షణ, సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా తెలుగింటి ప్రతి అక్కాచెల్లెమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు.




