Amaravati: పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు!
Amaravati: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
Amaravati: పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు!
Amaravati: భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, శ్రీ రాం మాధవ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. రాజకీయ, ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం కలిగిన పురంధేశ్వరి, రాం మాధవ్ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో వారి అనుభవం, సమర్థత ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా జాతీయ స్థాయిలో బీజేపీకి సంబంధించిన అన్ని విభాగాలకు సంయుక్త సమన్వయకర్తగా ఎంపికైన శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో వివిధ బాధ్యతలు పొందిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి నాయకత్వంలో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజాసేవ లక్ష్యాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు.
దేశ ప్రగతి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం సమష్టిగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల నుంచి పూర్తి సహకారం లభించాలని ఆకాంక్షించారు.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి




