Amaravati: చిలకలూరిపేట బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!

Amaravati: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Aug 2026 12:00 PM IST
Amaravati
X

Amaravati: చిలకలూరిపేట బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!

Amaravati: చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story