Hyderabad: శ్రీవారి చిత్రపటం.. వెంకటగిరి నేత కళ.. మోదీని ఫిదా చేసిన నారా ఫ్యామిలీ!
Hyderabad: హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడు కుటుంబంతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ.
Hyderabad: శ్రీవారి చిత్రపటం.. వెంకటగిరి నేత కళ.. మోదీని ఫిదా చేసిన నారా ఫ్యామిలీ!
Hyderabad: హైదరాబాద్ పర్యటనలో బిజీ షెడ్యూల్ మధ్య కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమయం కేటాయించి సీఎం చంద్రబాబు కుటుంబంతో గంటకు పైగా గడపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా... కుటుంబ సభ్యుడిలా ఆత్మీయంగా కలిసిపోవడం “నమో-నారా బంధం” ఎంత బలంగా ఉందో మరోసారి చాటిచెప్పింది. దేశ రాజకీయాల్లో అనేక కూటములు వస్తుంటాయి... వెళ్తుంటాయి. కానీ కొన్ని అనుబంధాలు మాత్రం వ్యక్తిగత విశ్వాసం, పరస్పర గౌరవం, కుటుంబ సాన్నిహిత్యంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. మోదీ-చంద్రబాబు మధ్య ఉన్న బంధం కూడా అలాంటిదేనని టీడీపీ, బీజేపీ వర్గాలు చెబుతున్నాయి..
*తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రధానికి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చిన చంద్రబాబు కుటుంబం*...
ఆంధ్రప్రదేశ్ రుచులను పరిచయం చేస్తూ సంప్రదాయ వంటకాలతో తేనీటి విందు ఏర్పాటు చేసింది. అతిథి దేవోభవ భావనతో స్వాగతం పలికిన నారా కుటుంబం.. విశిష్ట అతిథిగా వచ్చిన ప్రధాని మోదీని ఆత్మీయంగా సత్కరించింది. ఈ సందర్భంలో వెంకటగిరి జామ్దానీ నేత కళాకారులు ప్రత్యేకంగా రూపొందించిన శ్రీవారి చిత్రపటాన్ని ప్రధానికి అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్లోకాలతో అలంకరించిన ఆ చిత్రపటం... ఆంధ్రప్రదేశ్ చేనేత వైభవానికి ప్రతీకగా కనిపించింది.
*లోకేష్‌పై ప్రధాని ప్రత్యేక అభిమానము... గురువు-శిష్య సంబంధంలా మారిన అనుబంధం
“నన్ను కలవడానికి రావా?” అంటూ సభా వేదికపైనే ఆహ్వానించిన మోదీ*
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువనేతగా ఎదుగుతున్న నారా లోకేష్ పట్ల ప్రధాని మోదీకి ఉన్న ఆప్యాయత గత కొన్నేళ్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో “నన్ను కలవడానికి రావా?” అంటూ అందరి ముందే లోకేష్‌ను ఢిల్లీకి ఆహ్వానించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆ ఆహ్వానం మేరకు భార్య నారా బ్రహ్మీని, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లిన లోకేష్ కుటుంబానికి మోదీ అత్యంత ఆత్మీయంగా స్వాగతం పలికారు...
సాధారణ మర్యాదలకే పరిమితం కాకుండా... కుటుంబ సభ్యుల ఆరోగ్యం, దేవాన్ష్ చదువు, కుటుంబ విషయాలు అడిగి తెలుసుకోవడం ప్రధాని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించిందని అప్పట్లో రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. దేవాన్ష్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని ముచ్చటించడం... “యువగళం” పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించడం... లోకేష్ రాజకీయ ప్రయాణాన్ని ఆసక్తిగా వినడం ప్రత్యేకంగా నిలిచాయి.
*యువమంత్రిలో నాయకత్వ లక్షణాలు చూసిన ప్రధాని..పరిణితి, ప్రణాళిక, వినయం... లోకేష్‌పై మోదీ ప్రశంసలు*
రాజకీయాల్లో నాయకత్వం ఒక్కరోజులో రాదు. క్రమశిక్షణ, వినయం, పని తీరు, ప్రజలతో అనుసంధానం ఇవన్నీ కలిసి నాయకుడిని తయారు చేస్తాయి. నారా లోకేష్‌లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ పలుమార్లు అభినందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి సభల నిర్వహణలో లోకేష్ చూపిన సమన్వయం ప్రధాని దృష్టిని ఆకర్షించింది. భారీ బహిరంగ సభలు, ప్రజా స్పందన, కార్యక్రమాల ప్రణాళిక అన్నింటినీ సమర్థంగా నిర్వహించడంపై మోదీ ప్రత్యేకంగా మెచ్చుకున్నట్లు సమాచారం.
విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రపంచ స్థాయిలో నిర్వహించడంలోనూ లోకేష్ కీలక పాత్ర పోషించారు. నెలరోజుల పాటు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడాన్ని ప్రధాని ప్రశంసించడమే కాకుండా... కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ప్రస్తావించినట్లు తెలిసింది.
అలాగే ప్రజలతో కలిసిపోయే స్వభావం, పెద్దల పట్ల గౌరవం, అతిథుల పట్ల మర్యాద, పార్టీ కార్యకర్తలతో అనుబంధం వంటి అంశాలు కూడా మోదీని ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఒక సభలో “బరువు తగ్గిపోయావు లోకేష్... త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు” అంటూ సరదాగా వ్యాఖ్యానించడం ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయతకు నిదర్శనం.
*డబుల్ ఇంజన్ సర్కారు... ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం..పోలవరం నుంచి అమరావతి వరకు... కేంద్ర మద్దతు సాధనలో లోకేష్ పాత్ర*
“డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ స్పీడ్‌తో పని చేస్తుంది” అని నారా లోకేష్ తరచూ చెప్పే మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో కనిపిస్తోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి చట్టబద్ధత, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం, విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్, భారీ పెట్టుబడుల ఆమోదం వంటి అంశాల్లో కేంద్రం నుంచి సహకారం తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
దేశంలో ఏ రాష్ట్ర మంత్రి కన్నా ఎక్కువసార్లు ప్రధాని మోదీని కలిసిన నాయకుల్లో నారా లోకేష్ ఒకరని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర అవసరాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, విద్యా రంగ అభివృద్ధి అంశాలపై తరచూ ప్రధాని దృష్టికి తీసుకెళ్తూ... కేంద్ర-రాష్ట్ర సమన్వయానికి వారధిగా నిలుస్తున్నారని చెబుతున్నారు.
*అరుదైన అతిథికి తెలుగు నేల గౌరవం
వెంకటగిరి జామ్దానీ నేతలో శ్రీవారి చిత్రం.. ఆధ్యాత్మికత-చేనేత కళల కలయిక*.
ప్రధాని మోదీకి అందించిన బహుమానం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెంకటగిరి జామ్దానీ నేత కళాకారులు అద్భుతంగా నేసిన శ్రీవారి చిత్రపటం... తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మికత, చేనేత వైభవం కలయికగా కనిపించింది. శ్లోకాలతో అలంకరించిన ఆ చిత్రాన్ని చంద్రబాబు కుటుంబం ప్రధానికి అందించగా... మోదీ ఆసక్తిగా పరిశీలించినట్లు తెలుస్తోంది..
తెలుగు సంప్రదాయ వంటకాలు, ఆత్మీయ ఆతిథ్యం, కుటుంబ సాన్నిహిత్యం, రాజకీయ అనుబంధం.. ఇవన్నీ కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశాన్ని సాధారణ మర్యాద భేటీగా కాకుండా.. “నమో-నారా బంధం”కు ప్రతీకగా మార్చాయి.




