Amaravati: రిటైర్డ్ ఎస్సై సీతారాముకు ఇండియన్ పోలీస్ మెడల్ బహూకరణ!
Amaravati: 42 ఏళ్ల విశిష్ట సేవలకుగానూ విశ్రాంత ఎస్సై కరిమికొండ సీతారాముకు ఇండియన్ పోలీస్ మెడల్. అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందజేత.
Amaravati: రిటైర్డ్ ఎస్సై సీతారాముకు ఇండియన్ పోలీస్ మెడల్ బహూకరణ!
Amaravati: రిటైర్డ్ ఎస్సై సీతారాముకు పోలీస్ పతకం పోలీస్ శాఖలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విశ్రాంత ఎస్సై కరిమికొండ సీతారాముకు ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపియం) అవార్డు వరించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇటీవల అమరావతిలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆయన పురస్కారాన్ని అందుకున్నారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామానికి నకు చెందిన సీతారాము 1984 జనవరి 13న పోలీస్ కానిస్టేబుల్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఆయనకు 2019 జూన్ 3న ఎస్సైగా పదోన్నతి లభించింది. పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా పనిచేసి జూన్ 2026 న విజిలెన్స్ ఎస్సై గా పదవి విరమణ పొందారు.
ఆయన 42 సంవత్సరాలుగా నిష్కళంకమైన సేవను అందించి తన ఉన్నత అధికారుల సంతృప్తిని పొందారు. ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం, గంజాయి కేసులు, నకిలీ ఐపీఎస్ అధికారి కేసును గుర్తించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు, ప్రధానమంత్రి/ముఖ్యమంత్రి సందర్శనలు, మహాశివరాత్రి, పుష్కరాలకు వాటి బందోబస్తు విధులకు సంబంధించి ఆయన అద్భుతంగా పనిచేశారు.
విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగంలో రేషన్ బియ్యం, గ్యాస్ సిలిండర్లు, ఎరువులు నకిలీ విత్తనాలను గుర్తించారు. ఆహారం పదార్థాల్లో నెయ్యి, నూనెలు, టీ పొడి, బాదం పొడి, బెల్లం పంటి వాటిలో కల్తీ ని గుర్తించి కేసులు నమోదు చేశారు. సర్వీసు సమయంలో ఆయన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా 168 నగదు బహుమతులు, 26 GSEలు, 21 ప్రశంసలు, సేవాపథకం, ఉత్తమ సేవాపథకం, అతియుత్కృష్ట సేవాపథకాలను అందుకున్నారు.
42సంవత్సరాలకు పైగా తన మొత్తం కెరీర్‌లో నామినీ అందించిన అన్ని ప్రశంసాపూర్వక సేవలకు, ప్రోత్సాహకంగా ఆయనకు ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) అవార్డును పొందారు. ఈ అవార్డు
ను స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్య మంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అమరావతి పెరేడ్ గ్రౌండ్ నందు అందుకున్నారు. ఈ సందర్బంగా విజిలెన్సు ఎస్పి, ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులలు అభినందనలు తెలిపారు.




