Amaravati: శ్రీసిటి ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి!
Amaravati: శ్రీసిటీ పరిశ్రమలో బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడంపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం. అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించిన మంత్రి.
Amaravati: శ్రీసిటి ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి!
Amaravati: శ్రీసిటిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తిరుపతి జిల్లా అధికారులతో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల వివరాలను తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు.
ప్రమాదంలో గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై కూడా మంత్రి అధికారులను ఆరా తీశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించాలని సూచించారు.
ప్రమాద ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని హోంమంత్రి అనిత అధికారులకు సూచించారు. క్షతగాత్రుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు అత్యంత కీలకమని, కార్మికుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంటున్నామని తెలిపారు.




