Amaravati: ప్రాణాలకు తెగించి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ

Amaravati: అమరావతి సీతానగరం వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని తాడేపల్లి ట్రాఫిక్ ఎస్ఐ నారాయణ బోటు సహాయంతో సాహసోపేతంగా రక్షించారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 26 Sept 2026 8:31 AM IST
Amaravati
X

Amaravati: ప్రాణాలకు తెగించి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ

Amaravati: కనకదుర్గమ్మ వారధి దగ్గర కృష్ణానదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తిని (వరద ప్రవాహాన్ని కూడా లెక్కచేయకుండా సాహసోపేతంగా మరబోటు సహాయంతో) రక్షించిన తాడేపల్లి ట్రాఫిక్ ఎస్ఐ నారాయణ

కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, భార్య అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు యత్నించగా తాడేపల్లి ట్రాఫిక్ ఎస్ఐ నారాయణ పోలీసులు, స్థానికుల సహాయంతో సురక్షితంగా రక్షించారు

మంగళగిరిలోని TIDCO హౌస్ బ్లాక్-బి, 31వ నంబర్ ఇంటికి చెందిన వినుకొండ నాగేశ్వరరావు (64), గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు

కొంతకాలం క్రితం జరిగిన ప్రమాదం కారణంగా ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు. కొంతకాలంగా ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో పాటు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో వారధి 13వ పిల్లర్ వద్ద నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు

అయితే ఎదురుగా ఉన్న మరో వంతెన పిల్లర్ గోడను పట్టుకుని సహాయం కోసం కేకలు వేస్తుండటాన్ని గమనించిన దారిన వెళ్లేవారు వెంటనే తాడేపల్లి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నారాయణకు సమాచారం అందించారు

ఎస్‌ఐ నారాయణ ఆధ్వర్యంలో సీతానగరం ఘాట్‌కు చెందిన మల్లి, ఆయన కుమారుడు గోపి సహకారంతో బోటును తీసుకుని వారధి వద్దకు చేరుకొని

ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న నాగేశ్వరరావును బోటు సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అనంతరం సీతానగరం ఘాట్ వద్దకు అంబులెన్స్‌ను రప్పించి ప్రథమ చికిత్స అందించారు

కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సకాలంలో స్పందించి రక్షణ చర్యలు చేపట్టిన ట్రాఫిక్ ఎస్ఐ నారాయణ ను స్థానికులు అభినందించారు

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA