అమరావతి: అమరావతిలో టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నేడు
అమరావతి: అమరావతిలో టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. చంద్రబాబు సమక్షంలో 252 మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు.
అమరావతి
అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ అమరావతిలో జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఉదయం 9.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ అధిష్టానం మొత్తం 252 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కార్యక్రమానికి పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.
Next Story




