Undavalli: గణేష్ నిమజ్జన ఊరేగింపును ప్రారంభించిన వంగవీటి రాధా

Undavalli: ఉండవల్లిలో ఘనంగా జరిగిన 22వ వార్షిక గణేష్ నిమజ్జన ఊరేగింపు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన వంగవీటి రాధా. భారీ బైక్ ర్యాలీతో ఘనస్వాగతం.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 20 Sept 2026 7:49 PM IST
Undavalli
X

Undavalli: గణేష్ నిమజ్జన ఊరేగింపును ప్రారంభించిన వంగవీటి రాధా

ఉండవల్లి: ఉండవల్లి సెంటర్‌ కరేపాకు తోట రోడ్డులో జై గణేష్ యూత్ కమిటీ,యుసి బాయ్స్ ఆధ్వర్యంలో 22వ వార్షిక గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం వినాయక నిమజ్జన ఊరేగింపును ఘనంగానిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జంగాల వెంకటేష్, లింగంశెట్టి కిషోర్ కుమార్ కమిటీ సభ్యులు, నిర్వాహకులు రాధా బాబుకు ఘన స్వాగతం పలికారు.అంతకు ముందు లింగం శెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో భారత్ మాతా సెంటర్ నుండి ఉండవల్లి సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు నిర్వహించారు.

ఈ సందర్భంగా వంగవీటి రాధా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గుమ్మడికాయతో దిష్టి తీసి, కొబ్బరికాయ కొట్టి నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు. రాధా రాక సందర్భంగా భారతమాత సెంటర్‌ నుంచి కరేపాకు తోట రోడ్డు వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు, మహిళలు, యువత ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు.

జంగాల వెంకటేష్ మాట్లాడుతూ.. రాధా బాబు కార్యక్రమానికి విచ్చేసి గణనాథుని నిమజ్జన ఊరేగింపును ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. 22 ఏళ్లుగా కొనసాగుతున్న గణేష్ ఉత్సవాలకు రాధా బాబు హాజరై నిర్వాహకులను అభినందించడం సంతోషంగా ఉందన్నారు. గణేశుని కృప కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

లింగంశెట్టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. రాధా బాబు చేతుల మీదుగా గణేష్ నిమజ్జన ఊరేగింపు ప్రారంభించడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. కార్యక్రమం ప్రశాంతంగా విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జై గణేష్ యూత్ కమిటీ, యుసి బాయ్స్ సభ్యులు సింగంశెట్టి శివరామకృష్ణ (ఎస్‌ఆర్‌కే), పెండ్యాల వెంకట్రావు, పసుపులేటి శ్రీనివాసరావు, రాజేష్, సింగంశెట్టి బిన్ను, గాదె వేణు, గాదె గణపతి, గుర్రాల సుధాకర్, ఉప్పు నితన్, ఉప్పు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA