Anantapur: 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు.. అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి దూకుడు!
Anantapur: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ.
Anantapur: 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు.. అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి దూకుడు!
Anantapur: ప్రతి నెల 1వ తేదిన ఇంటి వద్దకే వచ్చి 96శాతం మందికి ఒక్కరోజులోనే పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం.. దేశంలో ఏపీ తప్ప మరొకటి లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని 47వ రంగస్వామి నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన పింఛన్లు పంపిణ చేపట్టారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద వారితో మాట్లాడి.. వారి ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటూ పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలిసేది కాదని.. పింఛన్ల కోసం లబ్ధిదారులు పడిగాపులు కాసేవారన్నారు.
మా ప్రభుత్వంలో 1వ తేదిన ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందజేస్తున్నామని.. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే 4వేలకు పింఛన్ ని పెంచామన్నారు. అదే జగన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నారన్నారు. త్వరలోనే కొత్త పింఛన్లు వస్తాయని.. అర్హులైన అందరికీ అందజేస్తామన్నారు. నగరంలో వర్షం, ఈదురుగాలుల వలన కొంత ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవమేనని అయితే దీనిపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 305చెట్లు కూలిపోయాయని.. విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయన్నారు. తక్షణమే మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి చెట్లను తొలగించి.. విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారన్నారు.




