Parvathipuram: బాల్య వివాహాల నిర్మూలనతోనే ఉజ్వల భవిష్యత్తు: లీగల్ ఆఫీసర్ శ్రీధర్!

Parvathipuram: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారంలో భాగంగా సీతంపేట మండలం హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో లీగల్ ఆఫీసర్ పి. శ్రీధర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ నిర్వహించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 28 Nov 2026 5:51 PM IST
Parvathipuram
X

Parvathipuram: బాల్య వివాహాల నిర్మూలనతోనే ఉజ్వల భవిష్యత్తు: లీగల్ ఆఫీసర్ శ్రీధర్!

Parvathipuram: బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడం ద్వారానే బాలికల ఆరోగ్యం, భద్రత మరియు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ - జిల్లా బాలల సంరక్షణ విభాగం- లీగల్ ఆఫీసర్- పి శ్రీధర్ అన్నారు.లీగల్ ఆఫీసర్ శ్రీధర్ మాట్లాడుతూ అంతర్జాతీయ బాల్య దశబాల్య వివాహాల నిర్మూలనతోనే ఉజ్వల భవిష్యత్తుబలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బాల్య వివాహ ముక్త భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమం'లో భాగంగా శనివారం సీతంపేట మండలం.హాడ్డుబంగి గిరిజన ఆశ్రమ పాఠశాలలో లోని విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లీగల్ ఆఫీసర్ పి. శ్రీధర్.

మాట్లాడుతూ, చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల బాలికలు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, వారి విద్యాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వివరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూనే, బాల్య వివాహ నిరోధక చట్టం కింద తీసుకునే కఠిన చట్టపరమైన చర్యల గురించి,బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన మరియు బాల్య వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ సందర్భంగా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలల హక్కులు, బాల్య వివాహ నిషేధ చట్టంపై విద్యార్థులకు అధికారులు, నిర్వాహకులు అవ గాహన కల్పించారు.కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ఔట్రిచ్ వర్కర్ రావాడ హరికృష్ణ మరియు సిబ్బంది, ఇన్చార్జి హెడ్మాస్టర్ మరియు పీఈటి మల్లికా, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని, వాటికి వ్యతిరేకంగా పోరాడాలని 520 విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA