Anantapur: ఉచిత కంటి వైద్య శిబిరం 67 మందికి ఉచిత ఆపరేషన్లకు ఏర్పాట్లు!

Anantapur: ఉచిత కంటి శిబిరంలో 150 మందికి పరీక్షలు చేయగా, 67 మందిని బెంగళూరు శంకర ఆస్పత్రిలో ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేశారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 12 July 2026 8:37 PM IST
anantapur
X

Anantapur: ఉచిత కంటి వైద్య శిబిరం 67 మందికి ఉచిత ఆపరేషన్లకు ఏర్పాట్లు!

అనంతపురం: పామిడి పట్టణంలో: అన్ని ఇంద్రియాల్లో కన్ను అత్యంత ప్రధానమైనదని, కంటి చూపు కోల్పోతే జీవితం చీకటిమయమవుతుందని డా. తిరుపతి నాయుడు పేర్కొన్నారు.

పామిడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, బెంగుళూరులోని ప్రముఖ శంకర కంటి హాస్పిటల్ సహకారంతో ఆదివారం గ్రామంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు మొత్తం 150 మందిని పరీక్షించగా, అందులో 67 మందికి కంటి ఆపరేషన్ అవసరమని తేలింది. వారందరికీ బెంగుళూరు శంకర కంటి హాస్పిటల్ లో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు.

కార్యక్రమానికి వచ్చిన బాధితులకు, వారి వెంట వచ్చిన వారికి నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన లయన్స్ క్లబ్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story