Kundurpi: 90 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలు
Kundurpi: అనంతపురం జిల్లా కుందుర్పి ఎంపీటీసీ-1 ఎన్నికల్లో 90 ఏళ్ల వృద్ధురాలు వాలంటీర్ సాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.
Kundurpi: 90 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలు
కుందుర్పి: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను చాటిచెప్పే ఘటన కుందుర్పి మండలంలో చోటుచేసుకుంది. ఈరోజు కుందుర్పి ఎంపీటీసీ సెగ్మెంట్-1 పరిధిలో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో 90 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు వాలంటీర్ సహాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వయసు పైబడినా ఓటు వేయాలనే ఆసక్తితో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఓటు హక్కుపై యువత, నేటితరం నాయకులు అవగాహన పెంచుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ ఘటన చాటిచెబుతోంది.




