Punganur: అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం!

Punganur: అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలని క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ కోరారు.

MAHESH, PUNGANOOR
Published on: 21 May 2026 4:46 PM IST
Punganur
X

Punganur: అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం!

పుంగనూరు: అందరి సహకారంతో అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ పిలుపునిచ్చారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలోని ఐసిటిసి కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ విభాగాల నెలవారీ నివేదికలను పరిశీలించారు. రికార్డుల్లో వ్యత్యాసాలు ఉంటే సరిచేసుకుని మెరుగైన పనితీరు కనబరచాలని సూచించారు.

హెచ్ఐవి పాజిటివ్‌గా గుర్తించిన వారికి నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని ఏఆర్టీ కేంద్రాలు, ఐసిటిసి కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో భాగంగా హైరిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని, నిర్ధారణ అయిన వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఐసిటిసి కేంద్రాల్లో పరీక్షా కిట్లు, ఏఆర్టీ మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, మొదటి 95, రెండవ 95, మూడవ 99 లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలని పేర్కొన్నారు. అందరూ సమిష్టిగా పనిచేస్తే జిల్లాలో మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హిమవంత్ రెడ్డి, ఎల్‌టిగా రెహమాన్, జనచేతన సిబ్బంది, ఐసిటిసి సిబ్బంది, ఎన్‌జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story