Anantapur: AISF జిల్లా కార్యదర్శిపై ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు!
Anantapur: పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, మానసికంగా వేధించాడని AISF అనంతపురం కార్యదర్శి కుల్లాయి స్వామిపై బాధితురాలు జోష్ణ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
Anantapur: AISF జిల్లా కార్యదర్శిపై ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు!
Anantapur: ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామిపై ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనను నమ్మించి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకంగా, మానసికంగా వేధించి చివరకు మోసం చేశాడని బాధితురాలు జోష్ణ ఆరోపించింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్ సమయంలో కుల్లాయి స్వామితో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని పేర్కొంది. తనను ప్రేమిస్తున్నానని, తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా ఉపయోగించుకున్నాడని ఆరోపించింది.
అనంతరం పెళ్లి విషయం ప్రస్తావించగానే వివిధ కారణాలు చెబుతూ తన నుంచి తప్పించుకుంటున్నాడని వాపోయింది.ఈ విషయంపై ఇప్పటికే సీపీఐ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ నెలరోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు తెలిపింది.
దీంతో న్యాయం కోసం జిల్లా ఎస్పీని ఆశ్రయించి కుల్లాయి స్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది.తనను ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా, మానసికంగా వేధించిన కుల్లాయి స్వామిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది.




