Gooty: ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్
Gooty: ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు, అధిక ఫీజులను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ కోరింది.
Gooty
Gooty:అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలోని MEO కార్యాలయం నందు MEO రవి నాయక్ సార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ 2026-27వ సంవత్సరానికి ముందస్తుగా అడ్మిషన్లు చేస్తున్నారు ముందస్తు అడ్మిషన్లు మీద ఉన్న ధ్యాస పదవ (10) తరగతి ఫెల్ అయినా విద్యార్థుల పైన లేదు ఈ సమయంలోనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ముందస్తుగా అడ్మిషన్లు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి అదేవిధంగా కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు అరికట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య కోరుచున్నాము లేని పక్షంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఎదుట పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తి ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు వంశీ పురుషోత్తం రఫీ రంజిత్ వేణు తెజేశ్వర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు




