Anantapur: నీట్ లీకేజీ కలకలం.. అనంతపురంలో రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు!

Anantapur: నీట్ పేపర్ లీకేజీపై అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ నిరసన. ఎన్టీఏ రద్దు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం డిమాండ్.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 6 Jun 2026 12:41 PM IST
Anantapur
X

Anantapur: నీట్ లీకేజీ కలకలం.. అనంతపురంలో రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు!

Anantapur: కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న NTA సంస్థను రద్దు చేయాలి అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు దాదాపు 28 లక్షలు పైగా విద్యార్థులు నీట్ పరీక్షలు రాశారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ అయిందని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు.

లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే నీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story