Guntakal: మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే జయరాంకు విన్నపం!
Guntakal: గుంతకల్లు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు ఏఐటీయూసీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
Guntakal: మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే జయరాంకు విన్నపం!
అనంతపురం జిల్లా: గుంతకల్లు పట్టణ జనాభా కనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలి, సచివాలయం సిబ్బంది కార్మికులపై దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.
రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్ ఇంజనీరింగ్ కార్మికుల విభాగాలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పే విధానాన్ని విరమించుకోవాలని, హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఒప్పంద మరియు పొరుగు సేవా కార్మికులను పర్మినెంట్ చేయాలని, 60 సంవత్సరాల నుండి రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, మరణించిన కార్మికుల కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగ కోసం కల్పించాలని కోరారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులకు వర్తింపజేసే విధంగా చూడాలని, పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని నగరంలో కార్మికుల సంఖ్యను పెంచాలని, గ్రాడ్యూటి చట్టం మేరకు గ్రాడ్యూటి విడుదల చేయాలని, పిఆర్సి విడుదల చేసి మద్యంతర భృతి 30% విడుదల చేయాలని, పర్మినెంట్ కార్మికులకు విడుదల చేసిన బకాయిలన్నీ తక్షణమే విడుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించాలని తెలిపారు.
జీవో నెంబర్ 25 ప్రకారం మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరహారం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పదవీ విరమణ 62 సంవత్సరాలు పెంచింది, అదేవిధంగా ఔట్సోర్సింగ్ రంగంలో పనిచేసే కార్మికుల వయసు కూడా 62 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ, కార్మికులందరికీ ఒకటే వేతనం 35000 ఇవ్వాలని కోరుతూ, కార్మికులకు పని భారం తగ్గించాలనీ ఎమ్మెల్యే గారి కోరడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యలు తీసుకెళ్లగానే విజ్ఞప్తి చేశాం. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి.మహేష్, ఏపీ మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చిరంజీవి, ఎఐటియుసి మండల అధ్యక్షులు సురేష్,మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నరసయ్య,జిల్లా సహాయ కార్యదర్శి కొండయ్య, వాసు, ఇసాక్, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది.




