Kadiri: కదిరి 27, 28 వార్డుల్లో కూటమి ఎన్నికల ప్రచారం

Kadiri: కదిరి పట్టణంలోని 28, 27వ వార్డుల్లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 26 Oct 2026 11:40 PM IST
Kadiri
X

Kadiri: కదిరి 27, 28 వార్డుల్లో కూటమి ఎన్నికల ప్రచారం

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి పట్టణంలోని 28, 27వ వార్డుల్లో కూటమి మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆయా వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ప్రచారానికి వచ్చిన నాయకులకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతూ, హారతులు ఇచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కదిరి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.

నవంబర్ 1వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి షేక్ అర్షియా భాను గారితో పాటు 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అజిముల్లా, 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తుమ్మల అర్బజ్‌లను ఆదరించి, సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజలను కోరారు.

ప్రజల నుంచి లభిస్తున్న ఆత్మీయ ఆదరణ, విశేష స్పందనతో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారాన్ని కొనసాగించారు. కదిరి పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI