Sri Sathya Sai: దేశభక్తితో సాగాలి.. యువతకు డీఎస్పీ శ్రీనివాసులు పిలుపు!
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు.
Sri Sathya Sai: దేశభక్తితో సాగాలి.. యువతకు డీఎస్పీ శ్రీనివాసులు పిలుపు!
శ్రీ సత్యసాయి: పోలీస్ కార్యాలయంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు. అమర వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలతో, ఏ ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన స్వాతంత్ర్య సాధన కోసం చేసిన త్యాగాలను, గిరిజనుల హక్కుల కోసం సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఏ ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ యువత అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సేవే ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.




