Amadaguru: రూ.13.52 కోట్లతో 52 అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
Amadaguru: అమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 52 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రారంభించి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పీటవేశారు.
Amadaguru: రూ.13.52 కోట్లతో 52 అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
అమడగూరు: శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో సుమారు రూ.13.52 కోట్లతో చేపడుతున్న 52 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రారంభించారు.
పలు గ్రామాల్లో ఎమ్మెల్యేకు గ్రామస్తులు హారతులు పట్టి, పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు, కొత్తగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. దీంతో ఎమ్మెల్యే పర్యటన అభివృద్ధి కార్యక్రమాలతో కొనసాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరిగాయని, ప్రజాధనం దుర్వినియోగమైందని ఆమె ఆరోపించారు.
చంద్రబాబు సహకారంతో పుట్టపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ప్రజల మద్దతు లభిస్తుందని, పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని పల్లె సింధూర రెడ్డి తెలిపారు.




