Anantapur: ఓట్ల తొలగింపుపై కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన
Anantapur: అనంతపురం కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు.
Anantapur: ఓట్ల తొలగింపుపై కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన
Anantapur: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఓట్ల దొంగతనంతోనే అధికారాన్ని చేజిక్కించుకుంటోందని అనంతపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.2014 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ, ఓట్ల కొల్లగొట్టుడు విధానంతోనే బిజెపి నెగ్గుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
SIR ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా ఏకంగా 13 కోట్ల ఓట్లను, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 44 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని మండిపడ్డారు.ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు మరియు మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారని, ఆ కమిటీలోని సభ్యులే బహిరంగంగా చెబుతున్నా, అక్రమాలు తాళలేక ఇద్దరు సభ్యులు రాజీనామాలు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు.
నరేంద్ర మోదీ సర్కార్ దొంగ ఓట్ల ద్వారా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తూ, తమకు కావలసిన వ్యక్తులకు రాజ్యాధికారాన్ని కట్టబెడుతోందని విమర్శించారు.చేతనైతే రాబోయే 2029 ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఎన్నికలకు రావాలని బిజేపికి కాంగ్రెస్ నాయకుడు దాదా గాంధీ సవాల్ విసిరారు.
SIR ప్రక్రియను పారదర్శకంగా, సామరస్యంగా జరిపించాలని డిమాండ్ చేశారు.ఇటీవల జరిగిన CWC సమావేశంలోనూ కాంగ్రెస్ అత్యున్నత నాయకత్వం ఈ అంశంపై సమగ్రంగా చర్చించిందని, మోదీ ప్రభుత్వ ఓట్ల దొంగతనంపై కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాల ద్వారానే దేశవ్యాప్తంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ అక్రమాలకు నిరసనగా అనంతపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ, "డౌన్ డౌన్ బిజెపి" అంటూ కాంగ్రెస్ శ్రేణులు మిన్నంటేలా నినాదాలు చేశారు!




