Anantapur: లేడీ డీఎస్పీ నిర్వాకం.. అసలు గుట్టు విప్పిన రూరల్ పోలీసులు

Anantapur: అనంతపురం జిల్లాలో తాను డీఎస్పీని అని నమ్మించి రూ. 40 లక్షలు వసూలు చేసిన సరస్వతి అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 8 May 2026 2:33 PM IST
Anantapur
X

Anantapur: లేడీ డీఎస్పీ నిర్వాకం.. అసలు గుట్టు విప్పిన రూరల్ పోలీసులు

అనంతపూర్: అనంతపురంలో ఓ మహిళ తాను డీఎస్పీ, కానిస్టేబుల్ అంటూ 40 లక్షల వరకు దోచుకొని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముద్దినాయన పల్లి గ్రామానికి చెందిన సరస్వతి, అనంత గ్రామీణ ఆలమూరుకి చెందిన రంగనాయకులు పరిచయస్తులు. రంగనాయకులకు వరుసకు తమ్ముడు అయిన రామానాయుడును సరస్వతి డిఎస్పి అంటూ పరిచయం చేశాడు. తాను డీఎస్పీ నని తన పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదని చికిత్స చేయించాలంటూ పలుమార్లు రామానాయుడుతో రంగనాయకుల ద్వారా 40 లక్షల వరకు డబ్బులు అప్పుగా తీసుకుంది.

దీనికి సంబంధించి ప్రాంసరీ నోట్లను రామానాయుడుకు రాసి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ తాను డీఎస్పీ నంటూ నిత్యం బెదిరింపులకు పాల్పడుతోందని బాధితుడు రామానాయుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అనంతపురం రూరల్ పోలీసులు రామానాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సరస్వతి, రంగనాయకులు, రామానాయుడు వీరంతా కుటుంబ సభ్యులేనని పోలీసులు తెలిపారు. సరస్వతి తాను పోలీసును అంటూ మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సీఐ పుల్లయ్య తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story