Anantapur: అనంతపురంలో సిపిఐ భారీ నిరసన!
Anantapur: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తు.
Anantapur: అనంతపురంలో సిపిఐ భారీ నిరసన!
అనంతపూర్: పెట్రోల్, డీజిల్, మరియు వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
నిత్యవసర వస్తువులతో పాటు ఇంధన ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని సిపిఐ నేతలు మండిపడ్డారు. అనంతపురం వేదికగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల పక్షాన సిపిఐ పోరాటాలు మరింత ఉధృతం చేస్తుందని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:
శ్రీరాములు (సిపిఐ నగర కార్యదర్శి)
రమణయ్య (సహాయ కార్యదర్శి)
జి. చిరంజీవి (ఎఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్)
వీరితో పాటు సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




