Anantapur: అనంతపురం జిల్లాలో జూలై 24న ‘మెగా పేరెంట్స్ మీటింగ్’

Anantapur: అనంతపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో జూలై 24న భారీ ఎత్తున ‘మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం’ నిర్వహించనున్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 17 July 2026 11:16 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురం జిల్లాలో జూలై 24న ‘మెగా పేరెంట్స్ మీటింగ్’

Anantapur: అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈనెల 24వ తేదీన భారీ ఎత్తున ‘మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని’ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రకటించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

విద్యార్థులు & ఉపాధ్యాయులు జిల్లావ్యాప్తంగా మొత్తం 1,67,000 మంది విద్యార్థులు, అలాగే 10,500 మంది ఉపాధ్యాయులు ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామనే అంశాలపై తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా చర్చిస్తారు. స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనుల కోసం దాతల సహకారాన్ని కూడా తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘లీప్ యాప్’ (LEAP App) ద్వారా విద్యార్థుల చదువు, హాజరు మరియు ఇతర ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలిసేలా పక్కాగా అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ మెగా పేరెంట్స్ మీటింగ్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. తమ పిల్లల చదువు, ప్రగతి వివరాలను తెలుసుకుని, పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఓ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story