Anantapur: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజల్లో బ్రహ్మరథం - అనంత!

Anantapur: అనంతపురం 33వ డివిజన్‌లో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రచారం. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్, కార్పొరేటర్లను గెలిపించాలని పిలుపు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 24 Oct 2026 7:05 PM IST
Anantapur
X

Anantapur: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజల్లో బ్రహ్మరథం - అనంత!

అనంతపూర్: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా 33వ డివిజన్‌లో పర్యటించిన ఆయన.. నగరంలోని అన్ని వార్డుల్లో వైసీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్‌తో పాటు 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దిల్ షాద్ కు మిగిలిన అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 1200 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం పాత రోడ్లకే కొత్త రంగులు అద్ది అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి వద్దకే చేరేవని.. ప్రస్తుతం పేదలకు స్టోర్ బియ్యం వంటి సంక్షేమ ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదని ప్రజలు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వ పనితీరుపై తీర్పు ఇవ్వాలని అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.వైసీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్‌తో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను, పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM