Anantapur: అనంతపురంలో భారీ వర్షాలు జలమయమైన కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటన
Anantapur: అనంతపురం నగరంలో కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు నీటిమయమయ్యాయి.
Anantapur: అనంతపురంలో భారీ వర్షాలు జలమయమైన కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటన
Anantapur: నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటిమయమైన పలు కాలనీలను స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని జనశక్తి నగర్, ఎంజీ కాలనీ, రజక నగర్, అశోక్ నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి, వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
రహదారులపై నిలిచిన వర్షపు నీటిని త్వరితగతిన తొలగించేలా మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కొన్నిచోట్ల చెట్లు కూలిపోవడంతో ప్రమాదాలు జరగకుండా వాటిని వెంటనే తొలగించాలని సూచించారు.రజక నగర్‌లోని నడిమి వంకలో పేరుకుపోయిన చెత్తను జెసిబిల ద్వారా తొలగించే పనులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు స్వయంగా పరిశీలించారు. డ్రైనేజీలు, వంకలు, కాలువల్లో చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, తీగల కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అత్యవసర చర్యలు తీసుకోవాలన్నారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్, రూరల్ ఎంపీడీవో, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. వర్షాకాలంలో నగర పారిశుధ్యం, నీటి పారుదల వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.




