Anantapur Honey Trap Case: అనంతలో 'హనీట్రాప్' ప్రకంపనలు.. ఖాకీల అండతో రెచ్చిపోయిన లేడీ డాన్.. ఇద్దరు సీఐలపై ఎస్పీ వేటు!
Anantapur Honey Trap Case: అనంతపురం జిల్లాలో కలకలం రేపిన హనీట్రాప్ ముఠా అగడాలు. అందమైన మహిళలతో ఎర వేసి లక్షల దోపిడీ. ముఠాకు సహకరించిన ఇద్దరు సీఐలపై ఎస్పీ వేటు. లేడీ డాన్ రంగమ్మ అరెస్ట్.
Anantapur Honeytrap Case: అనంతలో 'హనీట్రాప్' ప్రకంపనలు.. ఖాకీల అండతో రెచ్చిపోయిన లేడీ డాన్.. ఇద్దరు సీఐలపై ఎస్పీ వేటు!
Anantapur Honey Trap Case: అనంతపురంలో హనీట్రాప్ వ్యవహరం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు వంటి ధనిక వర్గాలనే ఈ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంది. అందమైన మహిళలతో ఫోన్ కాల్స్ చేయించి..మాటలతో ఆకర్షిస్తూ.. వారిని ఏకాంతంగా కలిసే విధంగా ప్లాన్ చేస్తారు.. అదే సమయంలో బాధితులకు తెలియకుండా అశ్లీల వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి వాటిని బయట పెడుతామంటూ బెదిరిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తాజగా ఓ బాధితుడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసి..మరో పది లక్షల కోసం వేధించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లాలో తీవ్రకలకలం రేపిన హనీట్రాప్ కేసు పోలీసులకు ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసులో బాధితులను రక్షించాల్సిన పోలీసు అధికారులే ముఠాకు అండగా నిలిచారు. సూత్రదారులు, పాత్రదారులతో పాటు వారికి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై జిల్లా ఎస్పీ కొరడా జులిపించారు. రాప్తాడు సీఐ హర్ష, అనంతపురం త్రిటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌ను విధుల నుంచి తప్పించి వీఆర్ కు పంపుతూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. మహిళను ఎరగా వేస్తూ లక్షలు దోచుకుంటున్నారని గుర్తించారు. పోలీసు అధికారుల ప్రమేయంతో హనిట్రాప్ ముఠా అగడాలు మరింతగా పెరిగినట్టు దర్యాప్తులో తేలింది. సామాన్యులే కాకుండా మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు అధికారులే ఈ ముఠాకు సహకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హనీట్రాప్ దందాపై కొందరు బాధితులు నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులతో హనిట్రాఫ్ ముఠాకు ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాయని.. మహిళలను పంపి.. ఏకాంతంగా ఉన్న సమయంలో ముఠా సభ్యులు దాడి చేస్తున్నారని.. డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసు పెడుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ జగదీష్ హనీట్రాప్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. హనిట్రాప్ కేసులో లేడీడాన్ రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో పది మందిని అదుపులోకి తీసుకు విచారిస్తున్నారు. మహిళలను ఎరగా వేసి లక్షల రూపాయలు దోచుకుంటున్నట్టు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి పది లక్షలు వసూలు చేసిన ముఠా ..ఓ జ్యోతిష్యుడి నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. హనిట్రాప్ ముఠాకు సహకరిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై విచారణ కొనసాగిస్తున్నారు.




