Anantapur: కుందుర్పిలో వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన సీనియర్ నేత!

Anantapur: కుందుర్పిలో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత నేతి రామాంజనేయులు 12 కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

Indu
By Indu
Published on: 18 Oct 2026 12:21 PM IST
Anantapur
X

Anantapur: కుందుర్పిలో వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన సీనియర్ నేత!

అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు నేతి రామాంజనేయులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో 12 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.

కుందుర్పిలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో నేతి రామాంజనేయులు, సుబ్బరాయుడు, చాకలి మంజునాథ, లోకేష్, భాను ప్రకాష్, నేతి నింగప్ప, శ్రీకాంత్, మంజునాథ్, మారుతి, సత్తి, సాయి, హేమంత్ తదితరులు టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. వైసీపీ నాయకుడు రంగయ్య అసమర్థ పోకడల కారణంగానే తాను పార్టీ మారుతున్నట్లు నేతి రామాంజనేయులు ప్రకటించారు. ఈ చేరికతో కుందుర్పి మండలంలో రాజకీయంగా చర్చ మొదలైంది.

Indu

Indu