Anantapur: అనంతపురంలో 'ఇంటింటికీ' ఎమ్మెల్యే దగ్గుపాటి!
Anantapur: అనంతపురం అర్బన్ 5వ డివిజన్‌లో 'ఇంటింటికీ' కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భాగస్వామ్యం; దేశంలో ఏపీలో మాత్రమే సంక్షేమ పథకాలు.
Anantapur: అనంతపురంలో 'ఇంటింటికీ' ఎమ్మెల్యే దగ్గుపాటి!
Anantapur: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, ఈ ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్‌లో నిర్వహించిన 'ఇంటింటికీ' కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రతి ఇంటికీ వెళ్తూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర లోటులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలోనే ఊహించని రీతిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారని విమర్శించారు. పాఠ్యపుస్తకాలు, పాఠశాల బ్యాగులపై కూడా తన ఫోటోలు ముద్రించుకుని విపరీతమైన రాజకీయాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని, విద్యార్థులకు, తల్లులకు చేయూతనిచ్చేలా 'తల్లికి వందనం' కార్యక్రమానికి ఒక్కో నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ.67.50 లక్షల మేర నిధులు అందజేస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రాష్ట్రానికి దాదాపు రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేశారని వివరించారు. ఒక సుస్పష్టమైన ప్రణాళికతో అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.




