Anantapur: నగర సమగ్ర అభివృద్ధే కూటమి లక్ష్యం - ఎమ్మెల్యే దగ్గుపాటి!
Anantapur: అనంతపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. 6 డివిజన్లలో రోడ్‌షో, మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి.
Anantapur: నగర సమగ్ర అభివృద్ధే కూటమి లక్ష్యం - ఎమ్మెల్యే దగ్గుపాటి!
అనంతపూర్: అనంతపురం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆరు డివిజన్లలో విస్తృతంగా పర్యటించి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
22వ డివిజన్‌లో లక్ష్మీదేవి, 33వ డివిజన్‌లో నారాయణమ్మ, 30వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి, 31వ డివిజన్‌లో బొమ్మినేని శివ, 32వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి కౌసర్, 34వ డివిజన్‌లో సరిపూటి రమణ తరఫున ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.అనంతపురం నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలంటే నగరపాలక సంస్థలో ప్రజలకు జవాబుదారీగా పనిచేసే పాలన అవసరమని పేర్కొన్నారు.
నగర సమగ్ర అభివృద్ధి కోసం మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌తో పాటు 62 మంది కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజల సహకారంతో అనంతపురం నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.




