Anantapur: అనంతపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Anantapur: అనంతపురం అర్బన్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యమని వెల్లడి.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 15 Aug 2026 10:54 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అనంతపూర్: "80 ఏళ్ల స్వాతంత్ర్య భారత్ దిశగా దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'వికసిత్ భారత్' లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తుంటే... రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'వికసిత్ ఆంధ్రప్రదేశ్' ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు."

"80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అర్బన్ టీడీపీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ అని, దేశవ్యాప్తంగా మన త్రివర్ణ పతాకం గర్వంగా రెపరెపలాడుతోందని అన్నారు.

"వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు గడిచిన రెండేళ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా చట్టం చేశారని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు."

"గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన 'స్త్రీ శక్తి' పథకం విజయవంతంగా కొనసాగుతోందని... జిల్లాలోని 322 బస్సుల్లో ఇప్పటివరకు మహిళలు 2.80 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం 132 కోట్ల రూపాయలు వెచ్చించిందని వివరించారు."

"అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. రాబోయే రెండేళ్లలో మరో 100 కోట్లతో డ్రైన్లు, 160 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామని... ప్రజలందరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ఆశాభావం వ్యక్తం చేశారు."

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story