Anantapur: అనంతపురంలో ఎమ్మెల్యే 'స్పెషల్ డ్రైవ్'.. పార్కులకు కొత్త కళ!

Anantapur: అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక పర్యటన. నగరంలోని 28 పార్కులను అభివృద్ధి చేస్తామని హామీ.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 28 April 2026 8:17 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో ఎమ్మెల్యే 'స్పెషల్ డ్రైవ్'.. పార్కులకు కొత్త కళ!

Anantapur: అనంతపురం నగరంలో మరోసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక పర్యటన చేశారు. ఇవాళ తెల్లవారుజామున కమిషనర్ జశ్వంత్ రావుతో కలిసి ఆయన పలు కాలనీల్లో తిరిగారు. 26వ డివిజన్లోని రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ కు వెళ్లారు. అక్కడ మార్నింగ్ వాకర్స్, మహిళలతో మాట్లాడారు. పార్కులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి దృష్ట్యా పార్కులకు చిన్నారులు, తల్లిదండ్రులు ఎక్కువగా వస్తున్నారని అందుకే ఎక్కడా సమస్యలు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 28 పార్కుల్లోని సమస్యలను స్పెషల్ డ్రైవ్ చేపట్టి పరిష్కరిస్తామని చెప్పారు. తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కచ్చితంగా ఉండేలా చూస్తామన్నారు. జిమ్ పరికరాలన్నీ మరమ్మతులు చేస్తామని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి భవిష్యత్తులో కూడా ఆకస్మిక పర్యటనలు ఉంటాయని.. ఎక్కడైనా లోపాలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story