Anantapur: సీఎం చంద్రబాబు పాలనతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు - ఎమ్మెల్యే దగ్గుపాటి

Anantapur: ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే, ఏడాదిలోనే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 2 Sept 2026 5:21 PM IST
Anantapur
X

Anantapur: సీఎం చంద్రబాబు పాలనతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు - ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపూర్: ఐదేళ్ల పిచ్చి తుగ్లక్ పాలనలో 10 లక్షల కోట్లు అప్పులు పెట్టిపోతే.. కేవలం ఏడాదిలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన 46వ డివిజన్ ఐదవ రోడ్డులో పర్యటించారు.

రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సమస్య చెప్పిన వెంటనే పరిష్కరించే నాయకుడు ఎమ్మెల్యేగా వచ్చారని ఈ సందర్భంగా స్థానిక స్థానికులు అన్నారు. ఏ సమస్య ఉన్నా.. వెంటనే ఫోన్ ద్వారా చెప్పిన సరే ఎమ్మెల్యే దగ్గుపాటి స్పందిస్తున్నారన్నారు.

ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ రాష్ట్రం ఎంతో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నారన్నారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయంటే అది సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి వలనేనన్నారు.

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1296 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు. 160 కోట్ల రూపాయలతో త్వరలోనే కొత్త పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ రెండేళ్లలో 7.50 కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వివరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story