Anantapur: అనంతపురంలో 'ఇంటింటికీ తెలుగుదేశం'.. జగన్ సర్కార్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి ఫైర్!

Anantapur: అనంతపురంలో 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 28 July 2026 9:51 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో 'ఇంటింటికీ తెలుగుదేశం'.. జగన్ సర్కార్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి ఫైర్!

Anantapur: పేదల పెన్నిధి ఆశాజ్యోతి రాష్ట్రాన్ని దశా దిశ మారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మా మనవడు మా ఇంటి బిడ్డ గా మా ఇంటి ముందుకు వస్తున్న మా ఎమ్మెల్యే దగ్గుపాటికి స్వాగతం సుస్వాగతం అంటూ తమ వీధులలోకి ఆహ్వానిస్తున్నటువంటి అనంతపురం ప్రజలు రూ.5 లకే పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో తొలగించారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అనంతపురంలోని పాతూరు రాణి నగర్ ప్రాంతంలో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని కనకదాస విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుతో పాటు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ, గడచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. డీఎస్సీ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే, వైఎస్సార్సీపీ నాయకులు కుట్రపూరిత ఆలోచనలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక అక్రమాలు, అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని... జగన్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు ఇకపై నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రెండేళ్లలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని ఆయన వివరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story