Anantapur: అనంతపురం మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి ఫైర్

Anantapur: అనంతపురంలో ఎస్సీ వసతి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. జగన్ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ఇప్పుడు విప్లవాత్మక మార్పులని వ్యాఖ్య.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 19 July 2026 3:19 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి ఫైర్

అనంతపూర్: గత వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన విచిత్రమైన విధానాల వల్ల, విద్యార్థి లోకంలో ఆయన ‘తుగ్లక్ మామయ్య’గా ముద్ర వేసుకున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహం సమీపంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే శనివారం సందర్శించారు.

అక్కడ విద్యార్థులకు ‘విద్యా కానుక’ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసతి గృహాన్ని పూర్తిగా పరిశీలించి, అక్కడి వసతులను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలపై ఆరా తీసిన ఆయన, ఆ తర్వాత విద్యార్థులతో కలిసి అక్కడే కూర్చుని భోజనం చేశారు. భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. గత జగన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా పడకేసిందని విమర్శించారు. జగన్ తుగ్లక్ నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలు, బ్యాగులు, చివరకు బెల్టులపై కూడా జగన్ రెడ్డి తన ఫోటోలు వేయించుకుని పిచ్చి తుగ్లక్ తరహాలో వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ప్రచార పిచ్చిని చూసే విద్యార్థులంతా ఆయన్ను ‘తుగ్లక్ మామయ్య’ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.

కూటమి ప్రభుత్వంలో విద్యా విప్లవం

ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో పెను మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే ప్రసాద్ పేర్కొన్నారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.మంత్రి లోకేష్ తెచ్చిన సంస్కరణల ఫలితంగానే.. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు పోటీ పడుతున్నారని చెప్పారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని దగ్గుపాటి ప్రసాద్ ప్రశంసించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story