Anantapur: వినాయక ఉత్సవాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి!
Anantapur: అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో వినాయక చవితి ఉత్సవాలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ. మట్టి వినాయకులనే పూజించాలని పర్యావరణ పిలుపు.
Anantapur: వినాయక ఉత్సవాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి!
Anantapur: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద వినాయక చవితి ఉత్సవాలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించారు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండప నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. గత 44 ఏళ్లుగా సప్తగిరి సర్కిల్‌లో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు ఈసారి తన చేతుల మీదుగా అంకురార్పణ జరగడం భగవంతుడు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
వాతావరణ, నీటి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే ప్రతిష్టించాలని సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మట్టి వినాయకులను పూజించడం ఆనవాయితీ అని తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటితో పాటు పర్యావరణం కూడా కలుషితమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతపురం నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




