Anantapur: అసలైన క్రెడిట్ చోర్ జగన్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గుపాటి

Anantapur: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై జగన్ వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర ఆగ్రహం. అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై సంచలన వ్యాఖ్యలు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 1 Aug 2026 5:01 PM IST
Anantapur
X

Anantapur: అసలైన క్రెడిట్ చోర్ జగన్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపూర్: భోగాపురంకి ఎర్రబస్సు అయినా వస్తుందా అన్న జగన్ రెడ్డి.. ఈరోజు భోగాపురం ఎయిర్ పోర్ట్ నేను తెచ్చానంటున్నాడని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మండిపడ్డారు. అసలైన క్రెడిట్ చోర్ జగన్ రెడ్డి మాత్రమేనని ఆయన కామెంట్ చేశారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీతో పాటు ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి మహిళలు మంగళహారుతులతో స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ అనంతపురంలో ఒక పెద్దమనిషి మెగా డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారని.. ప్రతి రోజు ఏదో నిరసన అంటూ బయలుదేరుతున్నారని విమర్శలు చేశారు. ఆయన్ని ప్రజలు మరిచిపోయారనే ఇలాంటివి చేస్తున్నారన్నారు.

జగన్ రెడ్డి ఐదేళ్లలో అమరావతితో 3ముక్కలాట ఆడితే..సీఎం చంద్రబాబు 2029కి ఒక అద్భుతమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దబోతున్నారన్నారు. జగన్ రెడ్డి పోలవరాన్ని గాలికి వదిలేశారని.. ఇప్పుడు చంద్రబాబు గోదావరి పుష్కరాల్లోపు పోలవరాన్ని పూర్తి చేస్తారన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అనతి కాలంలోనే నిర్మించి దేశంలోనే నెంబర్ -1 నిలిపారన్నారు. మొదటి ఏడాది 60లక్షలు, రెండవ ఏడాది 4కోట్ల మంది ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు ఏది చేసినా ప్రపంచానికే రోల్ మోడల్ గా ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story