Anantapur: అనంతపురంలో జోరుగా అభివృద్ధి పనులు రూ.2.66 కోట్లతో శంకుస్థాపనలు

Anantapur: అనంతపురంలో రూ.2.66 కోట్ల అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధుల భూమిపూజ. నగరంలో రూ.1,300 కోట్లకు పైగా పనులు చేపట్టినట్లు వెల్లడి.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 30 Sept 2026 12:36 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో జోరుగా అభివృద్ధి పనులు రూ.2.66 కోట్లతో శంకుస్థాపనలు

Anantapur: అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరోసారి రికార్డ్ స్థాయిలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఒకే రోజు 2కోట్ల 66లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో కలిసి ఈ పనుల్ని ప్రారంభించారు.

టవర్ క్లాక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రూ.1.12కోట్లతో ఫుట్‌పాత్, రోడ్డు పనులు, రాజా, రమణ, రమేష్ థియేటర్ వద్ద 60లక్షలతో మరో 60లక్షలతో మైనార్టీ కమిటీ హాల్ తో పాటు వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ 26నెలల్లో రికార్డ్ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు చేశారు.

సుమారు 1300కోట్లకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినట్టు వివరించారు. ఇటీవలే 107 కోట్లతో తాగునీరు, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ప్లాంట్ ప్రారంభించామని.. ఆరు నెలల్లోనే దానిని పూర్తి చేస్తామన్నారు. అలాగే హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HAM) పథకం ద్వారా 50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు.

వచ్చే నెలలో మరో 160కోట్లతో డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో మేము రాజీ పడేది లేదని.. అసలు నగరంలో ఎప్పుడైనా వైసీపీ నాయకులు ఇలాంటి అభివృద్ధి చేశారా అని నిలదీశారు. మరోవైపు ఎంపీ అంబికా, ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM