Anantapur: రాయలసీమను గ్లోబల్ హబ్ చేయడమే లక్ష్యం!
Anantapur: రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
Anantapur: రాయలసీమను గ్లోబల్ హబ్ చేయడమే లక్ష్యం!
Anantapur: అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజీ క్రీడా ప్రాంగణంలో "గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్" పేరిట జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ప్రత్యేక ఔట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డ్రోన్ ఫ్లై షో ద్వారా ఉద్యాన రంగం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు రాయలసీమ అభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించే ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు.
అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ...
"రాయలసీమ ప్రాంతానికి ఉద్యాన రంగం ఎంతో కీలకమైనది. ఇక్కడి అనుకూల వాతావరణం, భౌగోళిక ప్రత్యేకతలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.వ్యవసాయంలో డ్రోన్లు, ఆధునిక సాగు పద్ధతులను వినియోగించడం వల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గి, దిగుబడి మరియు ఆదాయం పెరుగుతాయి.రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సాంకేతికత అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.రాయలసీమ రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది."




