Anantapur: ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి దగ్గుపాటి ప్రసాద్!
Anantapur: అనంతపురం జిల్లా పారిశ్రామిక ప్రగతిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో MSME వర్క్‌షాప్. 4 ఎకరాల్లో పార్కు ఏర్పాటు.
Anantapur: ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి దగ్గుపాటి ప్రసాద్!
Anantapur: అనంతపురం జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు. అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో గల అలెగ్జాండర్ హోటల్‌లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి వర్క్‌షాప్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా పారిశ్రామిక ప్రగతి ఎంతో అవసరమని అన్నారు.గుజరాత్ తరహాలో ప్రతి ఇంట్లో ఏదో ఒక పనితో పాటు చిన్న తరహా పరిశ్రమను నిర్వహించే విధానం అనంతపురం జిల్లాలో కూడా రావాలని ఆకాంక్షించారు.
ప్రతి ఇంటి నుంచి ఒక ఇంటర్‌ప్రెన్యూర్‌ను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు.పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అనంతపురం నగరంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం తరఫున అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు.యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు.




