Anantapur: వైసీపీ విమర్శలకు కూటమి మేయర్ అభ్యర్థి అజయ్ బాబు కౌంటర్!
Anantapur: అనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతల విమర్శలకు కూటమి మేయర్ అభ్యర్థి అజయ్ బాబు కౌంటర్ ఇచ్చారు. నగరానికి విమానాశ్రయం తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Anantapur: వైసీపీ విమర్శలకు కూటమి మేయర్ అభ్యర్థి అజయ్ బాబు కౌంటర్!
అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదో డివిజన్‌లో బీజేపీ మేయర్ అభ్యర్థి అజయ్ బాబు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ డివిజన్‌లో కూటమి తరఫున టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెడ్డిశ్వరిని బలపరుస్తూ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అజయ్ బాబు.. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ విమానాశ్రయం అంశంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాము ప్రకటించని మేనిఫెస్టోను వైసీపీ నేతలు ప్రచురించుకుని, దానిపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.
వైసీపీ నేతలు ఎద్దేవా చేసినప్పటికీ.. అనంతపురానికి విమానాశ్రయం తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామని అజయ్ బాబు స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న తమకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
కూటమి విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని పలువురు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారని, ఈ స్పందన తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.ఇతర పార్టీల మేనిఫెస్టోలపై విమర్శలు చేసే ముందు.. ముందుగా తమ మేనిఫెస్టోను సక్రమంగా పరిశీలించుకోవాలని వైసీపీ నేతలకు అజయ్ బాబు సూచించారు.




