Anantapur: అనంతపురంలో ఘనంగా 'సంచార జాతుల విముక్త దివాస్' వేడుకలు

Anantapur: సంచార జాతుల సాధికారతకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి: అనంతపురం నగరంలో విముక్త దివాస్ వేడుకల్లో ఎమ్మెల్యే పార్థసారథి.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 31 Aug 2026 5:03 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో ఘనంగా 'సంచార జాతుల విముక్త దివాస్' వేడుకలు

Anantapur: అనంతపురం నగరంలో సంచార జాతుల విముక్త దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల ఆత్మగౌరవం, హక్కులు, అభ్యున్నతి కోసం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంచార జాతులకు చెందిన వందలాది మంది హాజరయ్యారు.అనంతరం నగర వీధుల్లో తమ సంప్రదాయ కళలను ప్రదర్శించారు.

దీంతో అనంతపురం నగరం సంస్కృతి, సంప్రదాయాలతో కనుల పండుగగా మారింది.ఈ సందర్భంగా బీజేపీ నేత, ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ సంకల్పమన్నారు.

సంచార, అర్ధ సంచార జాతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలుతీసుకుంటున్నామని చెప్పారు.డీనోటిఫైడ్ కమిషన్ బోర్డుల ఏర్పాటు, అర్హులైన వారికి గుర్తింపు కల్పించేలా సర్టిఫికెట్ల జారీకి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story